అల్లు అర్జున్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్ర "డీజే (దువ్వాడ జగన్నాథమ్). ఈ చిత్రం గత నెల 24వ తేదీన విడుదలైంది. అప్పటి మంచి సూపర్‌హిట్ టాక్‌తో ముందుకెళుతోంది. పైగా, ఈ చిత్ర విజయంపై మెగా హీరోలంతా స్పందించారు. ఆకాశానికి ఎత్తేశారు. పొగడ్తలతో నింపేశారు.
అల్లు అర్జున్ చిత్రంపై మెగా ఫ్యామిలీ హీరోలు అంతలా స్పందించడంలో తప్పులేదు. కానీ, నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ మెగా హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా స్పందించడం ఇపుడు టాలీవుడ్‌ను ఆశ్చర్యానికి లోను చేస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఎంతో మెచ్చుకున్నారు.
ఈ చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ ప్రతిభ తనకు తెలిసిందేనని, అదుర్స్ చిత్రంలో తన రూపురేఖలనూ, బాడీ లాంగ్వేజ్‌ను సమూలంగా మార్చేశారు ఆయన అని అన్నారు. అలాగే, దువ్వాడ జగన్నాథమ్‌లో హీరో అల్లు అర్జున్ తీరు పూర్తిగా మార్చారు. ఆయన నటన అద్భుతంగా ఉంది. బ్రాహ్మణ గెటప్‌లో అల్లు అర్జున్ అదరగొట్టారు. సినిమాలో ఆయన డైలాగ్ డెలివరీ బాగా నడిచింది.
ఈ చిత్రానికి పరిశ్రమలో తిరుగులేదని అంటూ హీరోతో పాటు దర్శకుడు, నిర్మాతకి అభినందనలు చెప్పారాయన. ఎన్టీఆర్ ప్రశంసలకు బన్నీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యారు. ఓ హీరో మరో హీరో ప్రతిభను గుర్తించి మెచ్చుకోవడం సంస్కారవంతమైన చర్యగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందించారు. మొత్తానికి ఇదో ఆశ్చర్యకర విశేషమే.