కమల్ హాసన్ కొత్త పార్టీ... దసరా రోజు ప్రకటన?

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (07:13 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నారు. ఈ విషయాన్ని ఆయన దసరా పండుగ రోజున అధికారికంగా ప్రకటించనున్నారు. 
 
తమిళ చిత్ర పరిశ్రమలోని సీనియర్ నటీనటుల్లో కమల్ హాసన్ ఒకరు. ఈయన గత కొన్ని రోజులుగ రాజకీయాల్లో తలదూర్చుతూ వస్తున్నారు. ముఖ్యంగా, జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే ప్రభుత్వ అవినీతిపై అస్త్రాలు సంధిస్తున్నారు. 
 
దీంతో అన్నాడీఎంకే మంత్రులకు, కమల్ హాసన్‌కు పెద్ద మాటల యుద్ధమే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన సారథ్యంలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. 
 
ప్రముఖ నటుడు కమలహాసన్ విజయ దశమి, లేదంటే గాంధీ జయంతి రోజున తన రాజకీయ  పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. ఆ వెంటనే నవంబరులో జరగనున్న తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలహాసన్ పార్టీ పోటీ చేయనున్నట్టు సమాచారం. 
 
మొత్తంగా 4వేల మందిని అభ్యర్థులను కమల్ బరిలోకి దింపనున్నట్టు తెలుస్తోంది. డీఎంకేతో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేయాలనే ఆలోచనలో కమల్ ఉన్నట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు