పీకల్లోతు ప్రేమలో మహానటి... సంగీత దర్శకుడుతో సీక్రెట్ మ్యారేజ్?

ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (09:19 IST)
తెలుగులో 'మహానటి'గా గుర్తింపు పొందిన కీర్తి సురేష్ ఇపుడు పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నట్టు సమాచారం. పైగా, ఈమె తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్‌ను సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. 
 
దివంగత సీనియర్ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం "మ‌హాన‌టి". ఈ చిత్రంతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న న‌టి కీర్తి సురేష్‌. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉంది. ముఖ్యంగా, తెలుగులో మహేశ్‌బాబు "సర్కారు వారి పాట" 'రంగ్ దే' 'గుడ్ లక్ సఖి' తదితర చిత్రాల్లో నటిస్తోంది. 
 
అలాగే, త‌మిళంలోనూ పలు చిత్రాలకు సైన్ చేసింది. అయితే కీర్తి సురేష్ ప్ర‌స్తుతం యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్‌తో ప్రేమ‌లో మునిగి తేలుతుంద‌ని, త్వ‌ర‌లోనే వీరి వివాహం జ‌రగ‌నుందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. 
 
అనిరుధ్ ప్రముఖ గాయని జోనీతాగాంధీతో పీకల్లోతు ప్రేమ‌లో ఉన్నాడ‌ని కోలీవుడ్ మీడియా చెబుతుండగా, ఇప్పుడు ఆయ‌న కీర్తి సురేష్‌ను వివాహం చేసుకోనున్నాడంటూ కొత్త వార్త‌లు పుట్టుకురావ‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. 
 
ఈ వార్త‌ల‌పై పూర్తి క్లారిటీ రావాలంటే అనిరుధ్ కాని, కీర్తి కాని స్పందించి తీరాల్సిందే. అనిరుధ్ కెరీర్ విష‌యానికి వ‌స్తే విజ‌య్ హీరోగా తెర‌కెక్కిన "మాస్ట‌ర్" చిత్రానికి సంగీతం అందించాడు. ప్రస్తుతం తన స్నేహితుడు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న మరో  చిత్రానికి కూడా సంగీతం సమకూర్చుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు