మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". ఇది ఆయన 150వ చిత్రం కూడా. కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా, వీవీవినాయక్ దర్శకుడు. చిరంజీవి తనయుడు హీరో రామ్ చరణ్ నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే, ఈ చిత్రం ఆడియోను విడుదల చేయకుండా కేవలం ఒక్క పాట ఆడియోను మాత్రం యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. "అమ్మడు లెట్స్ డు కుమ్ముడు" పేరుతో సాగే ఈ పక్కా మాస్ సాంగ్‌కు సోషల్ మీడియాలో నెటిజన్లు బ్రహ్మరథం పట్టారు. ఆదివారం (25వ తేది) ఉదయం 9 గంటలకు మొత్తం 5,424,523 మంది నెటిజన్లు ఈ ఆడియోను వీక్షించారు. ఇది మెగా కాంపౌండ్‌ను మరింత సంతోషంలో ముంచెత్తింది.
ఈనేపథ్యంలో ఈ పాటకు సంబంధించి తాజాగా ఓ ప్రచారం ఫిల్మ్ నగర్‌తో పాటు.. సోషల్ మీడియాలో సాగుతోంది. ఇది మెగా కాంపౌడ్‌తో పాటు.. చిత్ర యూనిట్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ వార్త ఏంటంటే... 'అమ్మడు' పాట జూనియర్ బ్లాక్ బస్టర్ హిట్ "జనతా గ్యారేజ్"లోని 'పక్కాలోకల్' పాటకు జిరాక్స్ అని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
అంతేకాదండోయ్... 'పక్కా లోకల్', 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' పాటల ఆడియో క్లిపింగ్స్‌ను పక్కపక్కన వినిపిస్తూ 'అమ్మడు' పాటను దేవిశ్రీ ప్రసాద్ తన 'పక్కా లోకల్' సాంగ్ ట్యూన్ నుంచి కాపీ కొట్టి బాణీలు సమకూర్చాడనే ప్రచారం జోరుగా సాగుతోంది.