సుస్మిత కొణిదెల హీరోయిన్ అవుతుందా?

మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (22:18 IST)
మెగాస్టార్ చిరంజీవి పెద్దమ్మాయి సుస్మిత కొణిదెల కూడా హీరోయిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 
 
చిరంజీవి మూవీ ఖైదీ నెం.150 సినిమాకు కూడా ఆమె పనిచేసింది. ఇదివరకే నాగబాబు కూతురు నిహారిక యాంకర్ గా నటిగా అడుగులు వేసింది. 
 
తాజాగా సుస్మిత కూడా నటిగా అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. సైరా నరసింహారెడ్డి సినిమాకు కూడా ఆమె వర్క్ చేశారు. 
 
ఇక అదే విధంగా ఆమె రామ్ చరణ్ తేజ్ రంగస్థలం సినిమాకు కూడా వర్క్ చేయడం జరిగింది. నిర్మాతగానూ అదరగొడుతున్నారు. యువ హీరో సంతోష్ శోభన్ తో కలిసి ఒక సినిమాను నిర్మించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు