టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా. ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. 50 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి.. సీనియర్ హీరోల్లో 50 కోట్ల క్లబ్‌లో చేరిన ఫస్ట్ హీరోగా నాగార్జున ఓ కొత్త రికార్డ్ క్రియేట్ చేసారు. ఈ సినిమా ఇచ్చిన విజయంతో నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ప్రీక్వెల్ చేయాలనుకున్నారు. దీనికి టైటిల్ బంగార్రాజు అనే టైటిల్ అనుకోవడం.. ఫిల్మ్ ఛాంబర్లో రిజిష్టర్ చేయడం కూడా జరిగింది.
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున బంగార్రాజు అనే సినిమా చేయనున్నాడు అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ.. ఇప్పటివరకు ఎప్పుడు ప్రారంభం అవుతుందో క్లారిటీ లేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... కళ్యాణ్ కృష్ణ ప్రీక్వెల్ కోసం చాలా కథలు నాగ్‌కి వినిపించాడట. ఏ కథ నచ్చలేదని చెప్పాడట. ఫైనల్‌గా కళ్యాణ్ కృష్ణ చెప్పిన ఓ కథకి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడట కళ్యాణ్ కృష్ణ. మరో విషయం ఏంటంటే... ఇందులో నాగ్ సరసన అనుష్క నటించనుందని ఓ వార్త బయటకు వచ్చింది. అదీ..సంగతి.