ఒక వైపున నాయిక ప్రధానమైన కథలను.. మరో వైపున సీనియర్ స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీ బిజీగా ఉంటూ ఉంటుంది. తమిళ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే నయనతార, వీలును బట్టి తెలుగు.. మలయాళ సినిమాలు చేస్తూ ఉంటుంది.
దక్షిణాదిలో నయనతార మిగతా అందరి హీరోయిన్స్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటూ ఉంటుంది. ఈ విషయంలో ఆమె ఎంత మాత్రం రాజీ పడదని అంటారు. అయితే ఆమె వర్కింగ్ కూడా అంతే ఉంటుంది. తీసుకున్న పారితోషికానికి ఆమె పూర్తి న్యాయం చేస్తుందని అంటారు. అలాంటి నయనతార 'జవాన్' సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైంది.. భారీ విజయాన్ని పరిచయం చేసుకుంది.
దాంతో ఇప్పుడు బాలీవుడ్‌లోని బడా మేకర్స్ ఆమెను తమ సినిమాలకు తీసుకోవడానికి చేస్తున్నారట. సౌత్ వరకే పరిమితమయ్యే తన సినిమాలకు 5 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్న నయనతార, పాన్ ఇండియా సినిమాలకుగాను రూ.10 కోట్లు డిమాండ్ చేస్తోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ మాత్రం పారితోషికాన్ని బాలీవుడ్‌లో కొంతమంది హీరోయిన్స్ అందుకుంటూనే ఉన్నారు. నయన్ ఆ మాత్రం డిమాండ్ చేయడంలో ఆశ్చర్యం కూడా లేదు. కాకపోతే ఆమె డిమాండ్ చేసిందా? లేదా? అనేదే ప్రశ్న.