సమంతకు ఆఫర్లు తగ్గిపోతున్నాయి. చైతూతో అమ్మడి పెళ్లి కన్ఫామ్ అయిన తర్వాత ఆమెకు ఆఫర్లు సన్నగిల్లుతున్నాయి. సినీ మేకర్స్ సమంతను పక్కనబెట్టినట్లు సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్ వంటి హీరోయిన్ల కోసం నిర్మాతలు ఆఫర్లు ఇచ్చేందుకు ఎగబడుతున్నారు.
అలాగే బాలయ్య గౌతమీ పుత్ర శాత కర్ణిలో శ్రియా శరణ్.. బాహుబలి-2లో అనుష్క, కాటమరాయుడులో శృతి హసన్ వంటి వారున్నారు. అలాగే పవన్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కే కొత్త సినిమాలో కీర్తి సురేష్ ఎంపికైంది. పెళ్లి పనుల్లో ఉన్న సమంతను డిస్టబ్ చేయకూడదని త్రివిక్రమ్ కూడా కీర్తి సురేష్‌ను ఎంపిక చేసున్నాడు.