టీచర్లను నమ్ముకోవద్దు.. గూగుల్‌ని నమ్మండి.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్.. వివాదమేనా?

మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (14:11 IST)
ఎప్పుడూ తనకు తోచిన వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచే రాంగోపాల్‌వర్మ... ట్విట్టర్‌ వేదికగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. సినీనటుల దగ్గర్నుండి పలువురు ప్రముఖులను కించపరిచేలా సంచలన వాఖ్యలు చేసే వర్మ చూపు ఇప్పుడు టీచర్లపై మళ్లింది. 
 
ఉపాధ్యాయులను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాంగోపాల్‌వర్మపై పలువురు ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు వర్మ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీచర్లను నమ్ముకోవద్దు గూగుల్‌ని నమ్మండి అంటూ వర్మ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి