ప‌వ‌న్ కళ్యాణ్ - క్రిష్ రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ సినిమా? (video)

సోమవారం, 4 నవంబరు 2019 (22:13 IST)
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ గురించి గ‌త కొన్ని రోజులుగా వార్తలు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఎట్ట‌కేల‌కు ప‌వ‌న్ బాలీవుడ్ మూవీ పింక్ రీమేక్‌లో న‌టించ‌నున్న‌ట్టు అఫిషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ బోనీక‌పూర్ - టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ - దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 
 
వేణు శ్రీరామ్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇదిలావుంటే... ఈ సినిమాతో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌... క్రిష్‌తో ఓ సినిమా చేసేందుకు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇది జాన‌ప‌ద చిత్రం. ఈ భారీ చిత్రాన్ని ఎ.ఎం.ర‌త్నం నిర్మించ‌నున్నారు. దీనిని ప్యాన్ ఇండియా మూవీగా రూపొందించాల‌నుకుంటున్నార‌ట‌. బాహుబ‌లి సినిమాలో ఉన్న‌ట్టుగా భారీ సెట్టింగులు ఇందులో ఉంటాయ‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. 
 
ఎ.ఎం.ర‌త్నం ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మించాలి అనుకుంటున్నార‌ని తెలిసింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ భారీ చిత్రానికి 100 కోట్ల బ‌డ్జెట్ అవుతుంద‌ట‌. ఇది ప‌వన్ కెరీర్లో భారీ బ‌డ్జెట్ మూవీ. హిందీ మిన‌హా మిగిలిన భాష‌ల్లో ఈ సినిమాని రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని టాక్ వినిపిస్తోంది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు