ఈ నేపథ్యంలో శనివారం రాజమండ్రిలో గ్రాండ్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వేలాదిగా అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ హాజరుకావడం విశేషం. ఆయన పాల్గొనడం మెగా ఈవెంట్‌కు ప్రత్యేక శోభను చేకూర్చింది.
ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ తర్వాత, రామ్ చరణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా బాబాయ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఈవెంట్‌కు హాజరైనందుకు,ఎల్లప్పుడూ తన పక్కన నిలబడినందుకు పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ట్వీట్‌తో పాటు ఫోటోలు కూడా జత చేశారు. ఇవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు అభిమానుల నుండి విపరీతమైన స్పందన వచ్చింది.
మరోవైపు గేమ్ చేంజర్ ఈవెంట్‌కు చెందిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఈవెంట్ నుంచి బయల్దేర సమయంలో పవన్ చేతిలో చెర్రీని ఆగు ఆగు అంటూ సైగ చేస్తున్నారు. రెండుసార్లు లేచి కదిలేందుకు సిద్ధమైన రామ్ చరణ్‌ను ఉండమన్నట్లు చేతితో సైగ చేసి.. ఆపై పోలీసులకు సెక్యూరిటీని కరెక్ట్ గా వుందా అనే రీతిలో సైగ చేశారు. ఆపై చెర్రీని తీసుకుని అక్కడ నుంచి కదిలారు.