రాజకీయాలకు పవన్ కళ్యాణ్ వేస్ట్... టాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్...

సోమవారం, 8 మే 2017 (16:53 IST)
ప్రస్తుత రాజకీయాలకు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఏమాత్రం సరిపోరని టాలీవుడ్ దర్శకుడు ఒకరు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు. అరుణ్ ప్రసాద్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తమ్ముడు చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు.
 
ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... ప‌వ‌న్‌లాంటి వ్య‌క్తి అస‌లు రాజ‌కీయాల‌కు స‌రిపోడ‌న్నారు. త‌న వ‌ర‌కైతే ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి రావ‌డం అస్స‌లు ఇష్టం లేద‌న్నారు. ప‌వన్ క‌ల్యాణ్ ఎవ‌రైనా ఏదైనా అంటే మాట ప‌డ‌తాడేమో గానీ, తిరిగి మ‌రో మాట అనే మ‌న‌స్త‌త్వం కాద‌ని ఆయన చెప్పుకొచ్చారు. 
 
నేటి రాజ‌కీయాల‌కు ప‌వ‌న్ అస్స‌లు స‌రిపోడ‌ని, ప‌వ‌న్ మాట‌ల యుద్ధంలో గెల‌వ‌లేడ‌ని, ఎదుటివారిని ఓ మాట అన‌డం ప‌వ‌న్‌కు తెలియ‌ని పవన్.. నిత్యం పరస్పర ఆరోపణలు చేసుకుంటూ మాటలయుద్ధ సమరంలో ఎలా నెగ్గుకొస్తారని ఆయన ప్రశ్నించారు.
 
రాజ‌కీయాల్లో ఫిజిక‌ల్ ఫైట్ క‌న్నా.. మాట‌ల్లో ఆరితేరిన వారే గెలుస్తారన్నది జగమెరిగిన సత్యమన్నారు. అందుకే ప‌వ‌న్ రాజ‌కీయాల‌కు స‌రిపోడ‌ని, త‌నవ‌రకు వ‌స్తే ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి రావ‌డం అస్స‌లు ఇష్టం లేద‌న్నారు. అభిమానుల వ‌ల్లే ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చాడ‌ని, రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వారు మ‌లినంకాక త‌ప్ప‌ద‌న్నారు.

వెబ్దునియా పై చదవండి