ఈ వెబ్ సిరీస్‌కు డిమాంటి కాలనీ, కోబ్రా వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. 2010లో మిస్ యూనివర్స్ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన ఫోటోలతో దర్శకుడు మిష్కిన్ పూజా హెగ్డేకు ఛాన్స్ ఇచ్చారు.
ఆయన దర్శకత్వంలో 2012లో వచ్చిన మొగమూడి సినిమాతో పూజా తొలిసారిగా సినీ రంగానికి పరిచయమైంది. అదే సినిమా తెలుగులో మాస్క్ అనే పేరుతో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత దక్షిణాది, ఉత్తరాది భాషల్లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.