స్టోరీ డిమాండ్ చేస్తే నగ్నంగా నటించేందుకు అభ్యంతరం లేదని సినీ నటి రాధికా ఆప్టే మరోమారు బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. పైగా, నగ్నంగా నటించడం పట్ల తన భర్త కూడా అభ్యంతరం వ్యక్తం చేయడని... పైగా ప్రోత్సహిస్తాడని చెప్పింది. రాధికా ఆప్టే ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ జనాల మతులు పోగొడుతోంది.
హిందీ సినిమా 'పార్చ్ డ్'లో ఏకంగా నగ్నంగా కనిపించి జనాలకు షాక్ ఇచ్చింది రాధిక. అంతకు ముందు ఓ బెంగాలీ షార్ట్ ఫిల్మ్‌లో అర్థర్ధనగ్నంగా కనిపించింది. తన చేసే క్యారెక్టర్ల గురించి బోల్డ్‌గా మాట్లాడటం రాధికా ఆప్టే స్పెషాలిటీ. తాజాగా ఆమె మరో సంచలన వ్యాఖ్య చేసింది. కథతో సంబంధం ఉంటేనే అర్ధనగ్నంగా నటించడానికి తాను ఇష్టపడతానని చెప్పింది. స్టోరీ డిమాండ్ చేస్తే నగ్నంగా నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.