యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి మెగా అభిమానులు, నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రేక్షకులు సైతం ఎప్పుడెప్పుడు ఈ సినిమాని థియేటర్లో చూస్తామా.. అని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటే... ఈ సినిమా రిలీజ్ మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది.
2020లో జులై 30న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పుడు జులై 30న రావడం లేదట. ఆర్ఆర్ఆర్ సినిమాని 2020లో జులై 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామని రాజమౌళి, నిర్మాత దానయ్య ప్రెస్ మీట్ పెట్టి మరీ... అఫిషియల్ గా ప్రకటించినప్పటికీ... షూటింగ్ జరుగుతున్నప్పుడు రామ్ చరణ్‌కి, ఎన్టీఆర్‌కి గాయాలు అవ్వడంతో కొన్నాళ్లు షూటింగ్‌కి బ్రేక్ పడింది. అందువలన షూటింగ్ అనుకున్న ప్లాన్ ప్రకారం జరగలేదు. దీంతో ఈ మూవీ జులైలో ప్రేక్షకుల ముందుకు రావడం లేదని.. దసరాకి వస్తుందని వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే.. రిలీజ్ డేట్ పైన తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే... ఆర్ఆర్ఆర్ దసరాకి కూడా రావడం లేదట. 2021లో సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. కారణం ఏంటంటే.. షూటింగ్ చేయాల్సింది చాలా ఉందట. అందువలన దసరాకి రిలీజ్ చేయాలంటే పని ఒత్తడి బాగా పెరుగుతుందని... ఆలోచిస్తున్నారట. అందుచేత ఆర్ఆర్ఆర్ మూవీని 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరి.. త్వరలో రిలజ్ డేట్ పైన క్లారిటీ ఇస్తారేమో చూడాలి.