కెరటం అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ అనే చిత్రంలో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు వచ్చాయి. పలువురు స్టార్ హీరోల సరసన కూడా నటించింది. దీంతో మోస్ట్ వానెటెడ్ హీరోయిన్‌గా మారింది. అయితే ఎంత త్వరగా స్టార్ హీరోయిన్‌గా పాపులారిటీని దక్కించుకుందో అంతే త్వరగా క్రేజ్‌ని కోల్పోయింది. రామ్ చరణ్‌తో చేసిన 'ధృవ' సినిమా తరువాత మళ్ళీ రకుల్‌కి హిట్ అన్నది దక్కలేదు.