సాధారణంగా వయస్సు పెరిగితే అందం తగ్గుతుందంటారు. ముఖం ముడతలు పడి అందం విహీనంగా మారుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక సీనియర్ హీరోయిన్లయితే చెప్పనవసరం లేదు. పెళ్ళి తరువాత పిల్లల పోషణ చూసుకోవడం, హెల్త్ గురించి మర్చిపోవడం మామూలే.
అయితే కరోనా లాక్ డౌన్ తరువాత మళ్లీ ఆమె సినిమాల్లోకి వస్తోంది. అది కూడా పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించబోతోంది. ఇప్పటికే రాశి ఫోటోలు ఇన్‌స్టాగ్రాంలో హల్ చల్ చేస్తున్నాయి. ఆమె పోలీసు అధికారిణిగా నటిస్తున్న కొన్ని సీన్లకు సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ వయస్సులో కూడా రాశి అందం తరగలేదంటూ అభిమానులు పోస్టులు చేసేస్తున్నారు.