కాగా విశ్వసనీయ సమాచారం ప్రకారం 25 కోట్లకు వర్మతో ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు డీల్ కుదుర్చుకున్నట్లు శనివారంనాడు ఫిలింనగర్‌లో వార్త హల్‌చల్ చేస్తోంది. ఇందుకు తగినట్లుగానే సెన్సార్ కార్యక్రమాలు ఇంకా జరగలేదు. ఈ నెల 29న ఎట్టిపరిస్థితిల్లోనూ రిలీజ్ చేస్తానని వర్మ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇదంతా ఎన్నికల సమయంలో బెదిరించడానికేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ చిత్రాన్ని ఏప్రిల్ ఎన్నికల అనంతరం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.