నేను సినిమా చూస్తే ప్లాప్ అవుతుందట.. ఫ్యాన్స్ అంటున్నారు.. సమంత

గురువారం, 27 అక్టోబరు 2016 (11:53 IST)
అమ్మడు అడుగుపెడితే అద్భుతమే.. పట్టిందల్లా బంగారం. ఇంతలా పేరు తెచ్చుకున్న భామ అందాల సమంత. తన క్యూట్ నటనతో అందరిచేత శభాష్ అనిపించుకొని ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అయితే సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉండే సమంత ఎప్పటికప్పుడు ఆసక్తికర పోస్టులు పెట్టి... హల్‌చల్ చేస్తూ ఉంటోంది. 
 
తాజాగా మీడియాతో మాట్లాడుతూ తాను ఇక ఏ సినిమాని కూడా ఫ‌స్ట్ డే సినిమా హాల్‌కు వెళ్లిచూడ‌బోన‌ని తేల్చి చెప్పింది. ఈ నిర్ణ‌యాన్ని ఎందుకు తీసుకుందో కూడా చెప్పేసింది. ఇటీవ‌లే ఆమె న‌టించిన సినిమా ''జనతా గ్యారేజ్'' ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాను తాను తొలిరోజే థియేటర్ల‌కు వెళ్లి చూసింద‌ట‌. 
 
అయితే, థియేట‌ర్ల‌లోని అభిమానుల్లో కొందరు స‌ద‌రు సినిమాలు బాగోలేవ‌ని, ఎక్కువ రోజులు ఆడవ‌ని అనుకున్నార‌ట‌. అభిమానుల మాట‌లు త‌న చెవిలో ప‌డ‌టంతో తాను విరక్తి చెందినట్లు పేర్కొంది. అభిమానులు అనుకున్న‌ విధంగా ఆ సినిమాలు ప్లాప్ కాలేద‌ని, సూపర్‌హిట్‌ అయ్యాయని చెప్పింది. అందుకే తాను ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మీడియాతో చెప్పిందీ కుందనపు బొమ్మ.

వెబ్దునియా పై చదవండి