తాజాగా వీరిద్దరూ స్నేహితుడి పార్టీలో కనిపించారు. సమంత, రాజ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాజ్ నిడిమోరు నిర్మిస్తున్న "రక్త బ్రహ్మాండ్" వెబ్ సిరీస్‌లో సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇంకా నందిని రెడ్డి దర్శకత్వం వహించే కొత్త తెలుగు చిత్రంలో కూడా సమంత కనిపించనుంది.
ఇకపోతే.. సమంత సొంతంగా, త్రేలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించింది. అయితే ఇందులోనే మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది. ఈ మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, సమంత కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా సామ్ డేరింగ్ స్టెప్ తీసుకుందంట.
మార్పు తనతోనే మొదలు అవ్వాలని, తన సినిమాలో అందరికీ సమానంగా జీతం ఇచ్చిందంట. ఎలాంటి తేడాలు లేకుండా అందరినీ సమంత చూస్తుందని, ఇప్పటి వరకు ఇలా ఎవరూ చేయలేదని నందిని రెడ్డి చెప్పుకొచ్చారు. పురుష, స్త్రీ నటులకు సమానంగా జీతాలు ఇచ్చిందని నందినిరెడ్డి వెల్లడించింది.