బ్రావోతో డేటింగా.. నో.. నో.. లంచ్ కోసమే రెస్టారెంట్‌కు కలిసి వెళ్లా: శ్రియా చరణ్

బుధవారం, 19 అక్టోబరు 2016 (11:00 IST)
బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణిలో నటిస్తున్న శ్రియా ఇటీవల వెస్టిండిస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావోతో కలిసి ఉండగా ఫోటోకు చిక్కింది. బ్రావోతో కనబడగానే.. ఆమె అతనితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో శ్రియా చరణ్ స్పందించాల్సి వచ్చింది.

శ్రియా బ్రావోతో డేటింగ్ చేస్తుందంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడంలేదని స్పష్టం చేసింది. మామూలుగా లంచ్ కోసమే అతనితో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లానని చెప్పింది. తాను ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నానని, జీవితం చాలా సంతోషంగా ఉందని శ్రియా తెలిపింది. 
 
కాగా ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి డ్వేన్ బ్రావోతో కలిసి శ్రియా బయటకు వస్తున్న ఫోటో ఒకటి మీడియా కంటపడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఫోటోలు పత్రికల్లో రావడంతో పాటు వీరిద్దరూ కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే తాను ప్రస్తుతం సినీ షూటింగ్‌ల్లో బిజీ బిజీగా ఉన్నానని.. ఎవరితోనూ డేటింగ్‌లో లేనని స్పష్టం చేసింది. 

వెబ్దునియా పై చదవండి