కేసు నమోదయ్యాక శ్రీరెడ్డి ఫోన్ స్విచాఫ్? అరెస్ట్ కోసం పోలీసులు గాలింపు?

ఐవీఆర్

సోమవారం, 22 జులై 2024 (21:23 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పైన అసభ్య పదజాలం ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో దూషణలకు పాల్పడుతున్న సినీ నటి శ్రీరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజు యాదవ్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆమెపై కర్నూలు 3 టౌన్ పోలీసు స్టేషనులో కేసు పెట్టిన దగ్గర్నుంచి సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పోస్టులు చేయడంలేదు. అంతకుముందే... ఇపుడున్న టెక్నాలజీతో పోలీసులు తనను అరెస్ట్ చేయడం పెద్ద విషయం కాదని శ్రీరెడ్డి చెప్పింది.
 
కేసు పెట్టిన రాజు యాదవ్ మాట్లాడుతూ... శ్రీరెడ్డి విషపు పురుగు. ఇలాంటివారు సమాజంలో వుండకూడదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారిని సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్లు దారుణ పదజాలాన్ని ఉపయోగిస్తూ దుర్భాషలాడుతున్నట్లు చెప్పారు. ఇలాంటి వ్యక్తిని ఎంతమాత్రం వదిలిపెట్టకూడదని అన్నారు. సభ్యసమాజం ఏమనుకుంటుందో అనేది కూడా ఇలాంటివారికి వుండదనీ, అందువల్ల ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరినట్లు రాజు యాదవ్ చెప్పారు.
 
ఈ నేపధ్యంలో పోలీసులు శ్రీరెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో పోస్టు పెడితే ఆమె ఎక్కడ వున్నదో ట్రేస్ చేయడం సుళువు అవుతుందన్న భయంతో శ్రీరెడ్డి ప్రస్తుతం ఫోన్ స్విచాఫ్ చేసుకున్నట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు