రజినీకాంత్ అంటే స్టైల్... జాకీచాన్ అంటే యాక్షన్... స్టైల్ యాక్షన్ రెండూ ఒక చోట చేరితే... ప్రేక్షకులకు పండగే పండగ... ఈ కింగ్స్ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే... సంచలనమే... రికార్డు బద్దలు కొట్టడం ఖాయం. రజినీకాంత్ - జాకీచాన్ కాంబినేషన్లో సినిమాను తెరకెక్కించేందుకు కబాలి మలేషియన్ ప్రొడ్యూసర్ మొహద్ రఫీజీ మొహద్ జిన్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ విషయాన్ని నిర్మాత మొహద్ రఫీజీ మొహద్ జిన్ మలేషియన్ మీడియాకి కూడా తెలియచేసారట. రజినీకాంత్, జాకీచాన్, కాంబినేషన్‌లో ఓ ఫాంటసీ మూవీ రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే ఆ నిర్మాత రజినీకాంత్, జాకీచాన్‌లను కూడా సంప్రదించాడట. అంతేకాకుండా ఈ చిత్రానికి ''చినీ సగ'' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. ఇద్దరు మూవీ లెజెండ్స్ నటించే ఈ మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నారట.
అంతేకాకుండా ఈ సినిమాలో మలేషియా నటీనటులు కొందరు కీలక పాత్రల్లో నటిస్తారట. మలేషియాలోని చిని అనే సరస్సులో ఉండే డ్రాగన్ పైనే ఈ సినిమా స్టోరీ నడుస్తుందని నిర్మాత తెలిపారు. భారత్, నార్వే, ఇండోనేషియా, చైనాల్లో ఈ సినిమా షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నారట. నాలుగేళ్ల కిందటే ఈ సినిమా చేయాలనుకున్నానని అప్పట్లో కుదరలేదని మహమూద్ జిన్ చెప్పాడు. ఈ మూవీ చాలా వరకు గ్రాఫిక్స్‌తోనే ఉంటుందట. అన్ని అనుకున్నట్టు జరిగితే... ఈ ప్రాజెక్ట్ ఇండియన్ స్క్రీన్ పైనేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం ఖాయం.