భారత్‌పై ప్రతీకార జ్వాలతో నిత్యం రగిలిపోతూ పహల్గాం ఉగ్రదాడికి కుట్రపన్నిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్‌కు ఆ దేశ ప్రభుత్వం బహుమతి ఇచ్చింది. ఆయనకు అత్యున్నత స్థాయితో కూడిన పదోన్నతి కల్పించింది. ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దేశంలోనే అత్యున్నత సైనిక హోదా గుర్తింపు పొందారు. ఈ మేరకు పాక్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో పాకిస్థాన్ తన సైన్యాధిపతికి ఇలాంటి ఉన్నతస్థాయి పదోన్నతి కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, అంతర్గత భద్రతా సవాళ్ల నేపథ్యంలో సైన్యం పాత్ర కీలకంగా మారిన సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.