టాలీవుడ్‌లో మంచి అవకాశాలు రాకపోవడం వల్ల ఉత్తరాదికి వెళ్లాల్సి వచ్చిందని తాప్సీ తెలిపారు. గతంలోనూ తాప్సీ చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్ అయ్యాయి. కాలేజీ చదివే రోజుల్లోనే మోడలింగ్‌లోకి వచ్చానని, క్యాట్ ఎగ్జామ్‌లో 88 శాతం స్కోర్ చేసిన నేను పాకెట్ మనీ కోసం సరదాగా నటనవైపు వచ్చాను. ఊహించని విధంగా టాలీవుడ్‌లోకి వచ్చానని చెప్పింది.
అయితే తాను నటించిన మూడు సినిమాలు ఫట్ కావడంతో తనపై ఐరన్ లెగ్ ముద్ర పడిపోయిందని.. అప్పటి నుంచి తనను సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకునేందుకు హీరోయిన్లు జడుసుకున్నారని.. అయితే తాను పనిచేసిన మూడు సినిమాల్లోనూ పెద్ద డైరక్టర్లు హీరోలున్నా.. వాటి వైఫల్యానికి తన దురదృష్టమే కారణమైపోయిందని చెప్పుకొచ్చింది. ఈ విధంగా తాప్సీ ఇచ్చిన ఇంటర్వ్యూలో వేలాది కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.