నందమూరి వంశం నుంచి మరో హీరో రాజకీయాల్లోకి రానున్నారు. ఇప్పటికే నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. ఇపుడు ఆయన సోదరుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. హరికృష్ణ తనయుడు హీరో జూనియర్ ఎన్టీఆర్ గతంలో టీడీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. ఇపుడు నందమూరి తారకరత్న రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు.
ఇప్పటికే ప్రచారంలో ఉన్న నియోజకవర్గాల పునర్విభజన దిగ్విజయంగా సాగితే తారకరత్నకు సీటివ్వడం కష్టమేమీ కాదు. ఒకవేళ అలా కుదరని పక్షంలో ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యేని తప్పించాల్సి ఉంటుంది. మరి తమ ఫ్యామిలీ మెంబర్ కోసం పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్ ఏం చేస్తారా? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో సాగుతోంది.