తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన కొందరు హీరోలు ఇపుడు తమ సినిమాలకు మినిమం ఓపెనింగ్స్ కూడా అందుకోలేకపోతున్నారు. వీరు నటిస్తున్న చిత్రాలకు కనీసం వారు తీసుకుంటున్న పారితోషికాన్ని కూడా తిరిగి రాబట్టలేకపోతున్నారు. ఇలాంటి హీరోల్లో రవితేజ, నితిన్, వరుణ్ తేజ్ వంటి పలువురు హీరోలు ఉన్నారు. ఇలాంటి హీరోల థియేట్రికల్ మార్కెట్ మైనస్‌లోకి వెళ్ళిపోతుంది.
వరుణ్ తేజ్ నటించిన గత మూడు చిత్రాల మినిమం రూ.3 కోట్ల షేర్‌ను కూడా వసూలు చేయలేకపోయింది. అలాగే, మాస్ మహరాజ్ రవితేజ నటించిన నాలుగు చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి పరాజయం పాలయ్యాయి. నితిన్‌కు గత నాలుగేళ్ళుగా ఐదు ఫ్లాప్స్ వచ్చాయి. నిన్నమొన్నటివరకు ఓటీటీ డీల్స్ అయినా అయ్యేవి. ఇపుడు ఇలాంటి హీరోల చిత్రాలకు కష్టమైపోయాయి.
ప్రొడక్షన్ హౌస్‌లు తీసే స్టార్ హీరోల సినిమాలతో కలిపి ఈ చిత్రాలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 'మజాకా' సినిమాకు టాక్ బాగున్నప్పటికీ సందీప్ కిషన్‌కు ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించే ఛాన్స్ లేకపోవడంతో ఆశించిన స్థాయిలో వసూళ్ల రాలేదు. ఓవరాల్‌గా స్టార్ హీరోల మినహాయిస్తే మిగతా హీరోల భవిష్యత్ ఇపుడు అగమ్యగోచరం అన్నట్టుగా ఉందని చెప్పొచ్చు.