ఆ సమయం వస్తే నాకు నచ్చిన అందమైన మహిళతో గడపాలనుకుంటా: నాగచైతన్య

బుధవారం, 17 ఆగస్టు 2022 (15:26 IST)
లాల్ సింగ్ చడ్డా చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం చేసిన నాగచైతన్యను ఆంగ్ల మీడియా వరుసగా ఇంటర్వ్యూలు చేస్తోంది. పర్సనల్ ప్రశ్నలు వేసి సమంత గురించి ఏమయినా సమాచారం లాగాలని ప్రయత్నిస్తోంది కానీ చైతు మాత్రం డిఫరెంటుగా స్పందిస్తూ వారికి మాత్రం దొరకడంలేదు.

 
మీ ఫస్ట్ క్రష్ ఎవరు అని చైతును ప్రశ్నిస్తే... తనకు మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ అంటే ఎంతో ఇష్టమని చెప్పాడు. అంతేకాదు... ఇదే విషయాన్ని ఆమెతో నేరుగా చెప్పేసాడట. తనకు వివిధ యాంగిల్స్‌లో నచ్చే హీరోయిన్లు బాలీవుడ్లో వున్నారని చెప్పాడు. ప్రియాంకా చోప్రా, అలియా భట్, కత్రినా కైఫ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు.

 
ఏదయినా ద్వీపంలో మీరు చిక్కుకుపోతే ఏం చేస్తారని ప్రశ్నిస్తే... తనకు ఇష్టమైన మ్యూజిక్ వింటూ వుండిపోతానని చెప్పాడు. ఆ సమయంలో తన మనసుకు దగ్గరైన ఓ అందమైన మహిళతో సమయం గడుపుతానంటూ వెల్లడించాడు. ఐతే ఆ అందమైన మహిళ ఎవరో మాత్రం చెప్పలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు