నయన- ప్రభుదేవాల మధ్య "కెమిస్ట్రీ" నిజమేనేమో!!

WD
నయనతార, ప్రభుదేవా మరోసారి సన్నిహితంగా కెమేరా కంటికి చిక్కారు. హైదరాబాదులో సౌత్ స్కోప్ స్టయిల్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో వీళ్లిద్దరూ ప్రక్కప్రక్కనే కూచుని పదే పదే ఒకరి చెవిలో ఒకరు గుసగుసమని ఊసులాడుతూ కనిపించారు. దీంతో అందరి కళ్లూ వీళ్లద్దరినే చూడటం మొదలుపెట్టాయి.

అయితే ఇదేమీ పట్టని నయన- ప్రభుదేవాలు తమదైన లోకంలో విహరించారు. జంకూ గొంకూ లేకుండా ఒకరిప్రక్కన ఒకరు కూచుని ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు కనిపించారు. వీరి వ్యవహార శైలిని చూసిన టాలీవుడ్ సినీజనం, ఇద్దరి మధ్య "కెమిస్ట్రీ" నడుస్తున్న సంగతి నిజమే అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

అంతకుముందు నయనతార ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ... ప్రభుదేవా అంటే తనకు పిచ్చప్రేమ అని పలికింది. అంతేకాదు ప్రభుదేవా భార్య తనపై మండిపడిందన్న వార్తలను తేలిగ్గా కొట్టి పారేసిందట. తను నటిని కాక ముందు నుంచే ప్రభుదేవా టాప్‌స్టార్ అనీ, అతని డ్యాన్సుకు తాను కాలేజీ రోజుల్లోనే ప్లాటయ్యానని చెప్పుకొచ్చిందట. ఇప్పుడు నేరుగా చూసింది కనుక ప్లాటుమీద ప్లాటయ్యిందన్నమాట.

వెబ్దునియా పై చదవండి