నాలో సోనియా గాంధీ పోలికలున్నాయా..?: కత్రినా

అందాల తార కత్రినా పలుకులు 

ప్రేక్షకుల్లో ఎక్కువగా యువతరం ఉంటుంది. కాబట్టి నేటి ట్రెండ్‌కు తగ్గ హీరోయిన్‌గా తను నిలదొక్కుకున్నట్లే అని కత్రినా కైఫ్ అనుకుంటోంది. ప్రస్తుతం మల్టీఫ్లేక్ ఫాలోయింగ్ చిత్రాలే చేస్తుంది. పైసా వసూల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.


రాజ్‌కుమార్ సంతోషి, ప్రకాష్ ఝా తీస్తున్న చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో కూడా తనకు ఆఫర్లు వస్తున్నా, పెద్దగా మనసుకు నచ్చలేదని చెప్పింది. మల్లీశ్వరి తర్వాత అలాంటి పాత్రలే వస్తుంటే రొటీన్ అని తిరస్కరించినట్లు చెప్పింది.


ప్రకాష్ ఝా చిత్రంలో సోనియాగాంధీ పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని చెపుతోంది కత్రినా. తను భోపాల్ వెళ్లినపుడు చీరలో వెళ్లిందట. అక్కడివారు తనను చీరలో చూసి అలా అనుకున్నారనీ, నిజానికి తనలో సోనియా పోలికలు కన్పించవని చెబుతోంది.

వెబ్దునియా పై చదవండి