"నేహాశర్మ" గ్లామర్ పంట పండింది.. అంతవరకేనా..?!

"చిరుత" చిత్రంలో "మగధీర" కథానాయకుడు రామ్‌చరణ్ సరసన నటించిన గ్లామర్ భామ నేహాశర్మ. 'చిరుత'లో అందాల ఆరబోతతో పండినా నటనాపరంగా, అందంపరంగా చాలా వరకు అభిమానుల్ని ఆకర్షించుకోలేకపోయింది. 

అయితే నేహాశర్మ మాత్రం అందాల ఆరబోతతో అవకాశాలు మోతెత్తిపోతాయనుకుంది. కాని ఆ తర్వాత ఆమెకు ఆశించినంత ఛాన్సులు రాలేదు. చిరుత సినిమా గ్యాప్ తర్వాత 'హ్యాపీడేస్' ఫేమ్ వరుణ్ సందేశ్ సరసన కుర్రాడు చిత్రంలో నేహా నటిస్తోంది. కానీ చరణ్ తొలి సినిమాలో ఆమెను ఎందుకు ఎంపికచేశారనే విమర్శలు ఇప్పటికీ ఫిలిం నగర్ వర్గాల్లో షికార్లు చేస్తూనే ఉన్నాయి.

మరోవైపు "చిరుత" చరణ్ తొలి చిత్రం కాబట్టి ఆకర్షణీయంగా నిలవాలనే ఆకాంక్షతో నేహాశర్మను ఎంపిక చేసినట్లు సినీ పెద్దలు విశ్లేషించారు. ప్రస్తుతం నేహాను తీసుకోవడానికి ఏ నిర్మాత ముందుకు రావడం లేదు.

మొన్నీమధ్యే బెల్లంకొండ సురేష్‌కూడా ఓ చిత్రానికి ఫోటోసెషన్స్ కోసం పిలిపించి మళ్లీ వద్దనుకుని వదిలేశాడు. కాకపోతే ఆమె రాకపోక ఛార్జీలు కూడా ఇచ్చి మరీ పంపాడు. మరి దేనికైనా ఇండస్ట్రీలో టైం ముండాలి. కదా.. మరి మీరేమంటారు..?.

వెబ్దునియా పై చదవండి