సినిమా రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ళ పై చెన్నైలో 8 మంది చర్చ

శుక్రవారం, 7 జులై 2023 (00:01 IST)
Aishwarya Rajesh, Malavika Mohanan, Madhu and others
ప్రైమ్ వీడియో వారి మైత్రి: ఫీమేల్ ఫస్ట్ కలెక్టివ్, చెన్నైలో తన మొదటి సెషన్ ను ఏర్పాటు చేసింది ఈ సెషన్ లో ఐశ్వర్య రాజేష్, మాళవిక మోహనన్, మధు వంటి బహుమతి గ్రహీతలైన నటీమణులు మరియు రేష్మ ఘటల, స్వాతి రఘురామన్, యామిని యజ్ఞమూర్తి వంటి తెర వెనుక - దృశ్యాల నిపుణుల నుండి అపర్ణ పురోహిత్ వంటి సృజనాత్మక నేలు మరియు మోడరేటర్ స్మృతి కిరణ్ వరకు భారతదేశపు అనేకమంది వినోద పరిశ్రమలకు ప్రాతినిథ్యం వహించే 8 మంది మహిళలు పాల్గొన్నారు.ఈరోజు మైత్రి: ఫీమేల్ ఫస్ట్ కలెక్టివ్ యొక్క తాజా సెషన్ ను విడుదల చేసింది. 
 
గత సంవత్సరం ప్రారంభించబడిన ఈ కలెక్టివ్, భారతీయ మీడియా మరియు వినోద పరిశ్రమ నుండి మహిళలు తన అనుభవాలు, సవాళ్ళు మరియు విజయాల గురించి చర్చించుకొనుటకు మరియు ఒక సానుకూల మార్పు గురించి తమ ధృక్పథాన్ని అందించుట కొరకు సమావేశం అయ్యేందుకు ఒక సురక్షితమైన చోటును సృష్టించుటకు చేసిన ఒక ప్రయత్నము.
 
ఈ సెషన్ లో భారత దేశపు అనేక వినోద పరిశ్రమల నుండి 8 మంది ప్రముఖ మహిళలు నటించారు. ఇందులో అనేక భాషలలో నటించిన మాళవిక మోహనన్, ఐశ్వర్య రాజేష్ మరియు మధు వంటి బహుమతి-గ్రహీతల నుండి, కెమెరా వెనుక చెరగని గుర్తులు వేసిన మహిళల వరకు,  రచయిత, షోరన్నర్ & నిర్మాత రేష్మ ఘటల, రచయిత & దర్శకురాలు స్వాతి రఘురామన్, మరియు సినిమాటోగ్రాఫర్ యామిని యజ్ఞమూర్తి, మరియు అపర్ణ పురోహిత్, క్రియేటర్ - మైత్రి & హెడ్ ఆఫ్ ఇండియా ఒరిజినల్స్, ప్రైమ్ వీడియో మరియు స్మృతి కిరణ్, మైత్రి యొక్క క్రియేటర్ మరియు క్యురేటర్ & వ్యవస్థాపకురాలు, పోల్క డాట్స్ లైట్ బాక్స్ మొదలైనవారు ఉన్నారు.
 
వ్యక్తిగత కథనాలను పంచుకుంటూ, పాల్గొన్నవారు చిత్ర పరిశ్రమలో ఉన్న లింగ విబేధాల గురించి, స్టీరియోటైపింగ్, వర్ణవాదం, వయోవివక్ష మొదలైన వాటితో సహా, మహిళా వృత్తినిపుణులు ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి చర్చించారు. ఆశ్చర్యకరంగా, వారు కెమెరా ముందు పనిచేస్తున్నారా లేదా కెమెరా వెనుక పనిచేస్తున్నారా లేదా వారు నిర్మాణ లేదా కార్పొరేట్ పాత్రలలో పనిచేస్తున్నారా అనేదానికి సంబంధం లేకుండా అన్ని సమస్యలు ఒకే విధంగా ఉన్నాయని ఆ మహిళలు గమనించారు.
 
"ప్రేరణ పొందుటకు సమానమైన ప్రాతినిథ్యం యువతులకు ఒక కొత్త ప్రపంచాన్ని తెరుస్తుంది, తద్వారా కొత్త గళాలకు వేదికను అందించగలిగే మరియు మరింతమంది మహిళలకు కొత్త అవకాశాలను అందించగలిగే, ప్రభావం చూపే స్థానాలలో మహిళలు ఉండటం ముఖ్యం చేస్తుంది," అని అపర్ణ పురోహిత్, క్రియేటర్ - మైత్రి & హెడ్ ఆఫ్ ఇండియా ఒరిజినల్స్, ప్రైమ్ వీడియో అన్నారు. "అయితే, మార్పు అనేది క్రమంగా జరిగే ఒక ప్రక్రియ. అందుచేత, దేశవ్యాప్తంగా ఇటువంటి చర్చలు కొనసాగించడం మనకు చాలా ముఖ్యం అవుతుంది మరియు చెన్నైలో మా మొదటి సమావేశాన్ని నిర్వహించుటకు మేమెంతగానో సంతోషిస్తున్నాము. ఒక సంవత్సరం పాతది అయినప్పటికీ, మైత్రి సరైన దిశలో మార్పును తెచ్చింది. ప్రజలు తమ ప్రాజెక్ట్స్ వ్రాసేటప్పుడు లేదా ప్రణాళిక చేసేటప్పుడు భిన్నత్వము, సమానత్వము మరియు చేరిక గురించి సంభాషణ జరపడం సంతోషంగా ఉంది.”
 
ఇటువంటి సంభాషణలు తరచూ నిర్వహించవలసిన అవసరం గురించి మాట్లాడుతూ, స్మృతి కిరణ్, క్రియేటర్ & క్యురేటర్, మైత్రి మరియు వ్యవస్థాపకురాలు, పోల్క డాట్స్ లైట్ బాక్స్ ఇలా అన్నారు. "మహిళలు ఎలాంటి భయం లేకుండా తమ కథనాలను వినిపించగలిగే చోటును కల్పించే అవసరాన్ని కాదనలేము. ఏదైనా మార్పు కొరకు మహిళలు తమ అనుభవాలను పంచుకొనుటకు ఒక వాతావరణాన్ని సృష్టించుట మొదటి చర్య, అది పరిశ్రమలో అయినా లేదా సమాజములో అయినా. తరచూ సంభాషణలు నిర్వహించాలి. అనటానికి కారణం ఇదే. మైత్రి ఈరోజు చెన్నైలో ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది, రేపు ఇది భారతదేశములో మరొక చోట నిర్వహించబడుతుంది. సంభాషణ మరియు తోడ్పాటు ద్వారా అన్ని వర్గాలు మరియు రాష్ట్రాలలోని మహిళలను మేము కలుస్తాము.”
 
తన కంటెంట్ మరియు ప్రొడక్షన్లు, మరియు సృజనాత్మక సమాజములోని తన భాగస్వాములతో, భిన్నత్వము, సమానత్వము మరియు చేరిక (డిఈఐ) లను ప్రోత్సహించడములో ప్రైమ్ వీడియో చాలా నిబద్ధత కలిగి ఉంది. మైత్రి: ఫీమేల్ ఫస్ట్ కలెక్టివ్ తో, వినోద పరిశ్రమలో మహిళలు పోషించే కీలకమైన పాత్ర గురించి అవగాహన కలిగించడం ప్రైమ్ వీడియో లక్ష్యము.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు