మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సెలబ్రెషన్స్.. 9 రోజులు.. ఎందుకు?

శనివారం, 11 జూన్ 2016 (16:51 IST)
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22వ తేదీన జరుగనుంది. ఈ వేడుకలను ఆగస్టు 14వ తేదీ నుంచి ఆగస్టు 22వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తన ఆట, పాటలతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే 150వ చిత్రంతో వెండితెర రీ ట్రీ ఇవ్వనున్నారు. 
 
ఇప్పటికే ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్స్ పూర్తి కాగా, జూన్ 20న ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఇక ఆ తర్వాత అంటే ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే కూడా ఉండడంతో ఈ డబుల్ బొనాంజాని ఫుల్‌గా ఎంజాయ్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు. ఇందులోభాగంగా చిరంజీవి పుట్టిన రోజు వేడుకలను 9 రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాణిపాకం, విజయవాడ, అంతర్వేది, శ్రీకాకుళం, వైజాగ్, జంగారెడ్డి గూడెం, సికిందరాబాద్, హైదరాబాద్, వేములవాడ.. ఇలా పలు ప్రాంతాలలోని దేవాలయాలలో తొమ్మిది రోజుల పాటు అభిమానులు పూజలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే వాటికి సంబంధించి ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 14 ఆగస్ట్ నుండి 22 ఆగస్ట్ వరకు ప్రతి రోజు ఒక్కో ఆలయంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

వెబ్దునియా పై చదవండి