హోంబళే ఫిలింస్, వారాహి చలన చిత్ర సంస్థలు సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న 'కేజీఎఫ్ చాప్టర్ 2'కు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ టాప్ హీరోలు నటిస్తున్నారు. ఫలితంగా ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.
ఇకపోతే.. కేజీఎఫ్ అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కన్నడలోనే కాక తెలుగు, తమిళం, హిందీ భాషలలో మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా కేజీఎఫ్ చాప్టర్ 2ను తెరకెక్కిస్తున్నారు. 2020లో ఈ చిత్రం విడుదల కానుంది.