దాసరి నారాయణరావుగారి శిష్యుడిగా నటుడిగా చిన్న చిన్న పాత్రలు వేస్తూ, హీరోగా ఎదిగిన నటుడు ఆర్. నారాయణమూర్తి. ఒరేయ్ రిక్షాతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆయనే నిర్మాతగా మారి దర్శకుడు, సంగీతం, కెమెరా, ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వహిస్తూ పలు సినిమాలు తీశాడు. ఆయన బాగానే సంపాదించాడు. కోటీశ్వరుడనే చెప్పాలి. అది అందరికీ తెలీని కోణం. కానీ తెలిసిన కోణం ఏమంటే, ఆయన జూబ్లీహిల్స్‌లో ఆటోలో తిరుగుతుంటాడు. నడుచుకుంటూ బస్టాప్ వరకు వెళ్ళి బస్ ఎక్కుతాడు. అది ఆయన నైజం. సామాన్యుడిలా వుండాలనేది ఆయన మతం కూడా. అలాంటి ఆయన్ను ప్రజాగాయకుడు గద్దర్ అన్న మాటలు కన్నీళ్ళు పెట్టించాయి.