ప్రాచీన విజ్ఞానానికి నిలువుట్డదం, విశ్వబ్రాహ్మణులు

గురువారం, 15 జులై 2021 (15:49 IST)
సృష్టికి ప్రతి సృష్టి చేసే వారు విశ్వకర్మల‌ని, చేతి వృత్తులలో ప్రత్యేకమైన శైలి కలిగి, నైపుణ్యంతో ప‌నిచేసే విశ్వ బ్రాహ్మణుల‌ను ఆదుకునేందుకు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కృత‌నిశ్చ‌యంతో ఉన్నార‌ని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెప్పారు. తాడేప‌ల్లిలో జ‌రిగిన రాష్ట్ర విశ్వ‌బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ స‌మావేశంలో మంత్రి గోపాల కృష్ణ‌తోపాటు ఎంపీ మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ‌, లేళ్ళ అప్పిరెడ్డిలు పాల్గొన్నారు. విశ్వ‌బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ తోలేటి శ్రీకాంత్ అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జరిగింది.
 
విశ్వబ్రాహ్మణులు ప్రాచీన విజ్ఞానానికి నిలువుట్డదం అని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అభివ‌ర్ణించారు. ప్రతి ఒక్కరూ మన జాతి జీవితాలను మార్చేలా రాజకీయ జీవితం గ‌డ‌పాల‌ని నాయ‌కుల‌కు సూచించారు. బిసిలందరూ సామజికంగా, రాజకీయంగా ఎదిగేలా ముఖ్యమంత్రి 56 కార్పొరేషన్ల ద్వారా మంచి అవకాశం కల్పించార‌ని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కులాల అభివృద్ధికి, ఔనత్వనికి కృషి చేయాల‌ని కోరారు.

నాడు - నేడు ద్వారా మన బిడ్డల విద్య జీవితంలో నూతన ఓరవడి తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని పేర్కొన్నారు. మన ముఖ్యమంత్రి మన బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని... ప్రణాళిక బద్దమైన కార్యచరణతో ముందుకు వెళ్ళుతున్నార‌ని కొనియాడారు.

త‌న‌కు ముఖ్యమంత్రి ఓ గొప్ప బాధ్యత అప్పగించార‌ని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసే అవకాశం ఓ గొప్ప అవకాశం నాకు ఇచ్చార‌ని మంత్రి పేర్కొన్నారు. ఈ రెండేళ్ళలో బిసిల కోసం వివిధ సంక్షేమ పథకాల ద్వారా 80 వేల కోట్లకు పైగా ఈ ప్రభుత్వం అందించింద‌న్నారు. పాల‌న అంటే వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముందు పాలన, తరువాత పాలన అని చెప్పుకుంటార‌ని మంత్రి అన్నారు.
 
వైఎస్ఆర్ సాఫల్య అవార్డు గ్రహీత కొండపల్లి కళాకారుడు వెంకట చారికి మంత్రి చెల్లుబోయిన, విశ్వ‌బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ తోలేటి శ్రీకాంత్ స‌న్మానం చేశారు.  వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నార‌ని, ఆయ‌న అడుగుజాడ‌ల్లో తాము న‌డుస్తామ‌ని విశ్వ‌బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ తోలేటి శ్రీకాంత్ చెప్పారు. విశ్వ బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తామ‌న్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు