ఓటీటీలో ఏ1 ఎక్స్‌ప్రెస్.. మే1న రిలీజ్.. టీజర్ రిలీజ్

గురువారం, 29 ఏప్రియల్ 2021 (15:36 IST)
సినిమాలు ప్రస్తుతం థియేటర్లలో విడుదల కావట్లేదు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ హవా నడుస్తుండటంతో థియేటర్ తర్వాత ఓటీటీల్లో విడుదలవుతున్నాయి సినిమాలు. తాజాగా ఈ జాబితాలో ఏ 1 ఎక్స్‌ప్రెస్ చేరిపోయింది. సందీప్‌కిషన్‌, లావణ్యత్రిపాఠి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్‌. డేనియస్ జీవన్ కానుకొలను డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.
 
హాకీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. మే 1న డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది.
 
సన్‌నెక్ట్స్ లో ప్రీమియర్ కానుంది ఏ1 ఎక్స్‌ప్రెస్. ఈ విషయాన్ని తెలియజేస్తూ సన్ నెక్ట్స్ కొత్త టీజర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయాపన్నెన్ సంయుక్తంగా నిర్మించారు. హిప్‌హాప్ తమిళ మ్యూజిక్ డైరెక్టర్

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు