పుష్ప2 సినిమా రిలీజ్ ముందు రోజు అనగా నిన్న రాత్రి 10గంటలకు హైదరాబాద్ సంథ్య థియేటర్లో అభిమానుల షో వేశారు. ఇందుకు తండోపతండాలుగా ఫ్యాన్స్ హాజరయ్యారు. అయితే అల్లు అర్జున్ వస్తున్నాడు అనగానే పెద్ద ఎత్తున తోపులాట జరగడం, కొందరు గాయపడడం, ఒకరు చనిపోవడం జరిగింది. దీనిపై రేవతి భర్త భాస్కర్ మీడియాముందుకు వచ్చాడు.