హైదరాబాదు వరద బాధితులకు భారీ విరాళాలు ప్రకటించిన నందమూరి బాలకృష్ణ

సోమవారం, 19 అక్టోబరు 2020 (11:45 IST)
గత కొన్ని రోజులుగా హైదరాబాదు నగరంలో కురుస్తున్న వర్షాల తీవ్రత వలన నగరం జలమయంగా మారిది. దీంతో ప్రజలు వరద ప్రవాహంలో చిక్కుకొని ముప్పతిప్పలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు.
 
భారీ సంఖ్యలో ప్రజలు వరదలు కారణంగా ప్రాణాలు కోల్పోగా వేలమంది నిరాశ్రయులయ్యయారు. ఈ సందర్భంగా బాలకృష్ణ హైదరాబాదు వరద బాధితుల కోసం రూ.1.50 కోట్లు విరాళం ప్రకటించారు. అంతేకాకుండా బసవ తారకరామ సేవా సమితి నేతృత్వంలో పాత బస్తీ వాసులకు ఆహారం అందించారు.
 
సుమారు 1000 కుటుంబాలకు బిర్యానీ పంపించారు. కాగా హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ వరద ఉధృతి తగ్గలేదు. నిన్న కురిసిన కుంభవృష్టితో నగరం మరోమారు జలమయం అయ్యింది. దీంతో అత్యధిక ప్రాంతాలు నీటమునిగాయి. ఎక్కడ చూసినా దయనీయ పరిస్థితులు కనిపిస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు