అలనాటి తార కాంచన తన ఆస్తులను ఆలయానికి దానం చేసింది. 1979, 80 కాలంలో అగ్రనటిగా పేరొందిన కాంచన.. ఎయిర్ హోస్టెస్‌గా వ్యవహరించారు. 1963వ సంవత్సరంలో శ్రీధర్ దర్శకత్వంలో కాదలిక్క నేరమిల్లై అనే తమిళ సినిమా ద్వారా పరిచయమయ్యారు.
ఆ తర్వాత తమిళ అగ్రనటులు ఎంజీఆర్, శివాజీ, రజనీ కాంత్‌లతో కలిసి నటించారు. ఈ మేరకు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 150 భాషలకు పైగా కాంచన నటించారు. ఇటీవల తెలుగులో విజయ్ దేవరకొండ హీరీగో నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోకు బామ్మగా కాంచన నటించారు.
ఈ నేపథ్యంలో వివాహమే చేసుకోని కాంచన తన రూ.80కోట్ల విలువగల ఆస్తులను తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి కానుకగా, దానంగా రాసిపెట్టేశారు. ఈ సందర్భంగా కాంచన మాట్లాడుతూ.. తన అసలు పేరు వసుంధరా దేవి. ఆ సమయంలో వైజయంతి మాలా అమ్మగారు అదే పేరుతో నటిస్తున్నారు. అందుకే తన పేరును కాంచనగా శ్రీధర్ మార్చేశారు.
46 ఏళ్ల పాటు విశ్రాంతి లేకుండా నటించానని కాంచన చెప్పారు. తాను సంపాదించిన డబ్బుతో చెన్నై టీనగర్‌లో ఆస్తులు కొనిపెట్టాను. అయితే బంధువులు ఆ ఆస్తులను అపహరించుకున్నారు. దీంతో కోర్టులో కేసు పెట్టి.. తన ఆస్తులను తిరిగి దక్కించుకున్నాడు. అలా తన చేతికి వచ్చిన ఆస్తులను వడ్డీ కాసుల వాడు.. శ్రీ వేంకటేశ్వరునికి కానుకగా ఇచ్చేశానంటూ కాంచన చెప్పుకొచ్చారు.