నాజర్ పుట్టిన రోజు.. 300 సినిమాలు.. ఛాన్స్‌ల కోసం వెళ్తూ.. కమీలాతో ప్రేమ!

శుక్రవారం, 5 మార్చి 2021 (13:52 IST)
Nassar
ప్రముఖ నటుడు, నిర్మాత, రచయిత, దర్శకుడు, గాయకుడు అయిన నాజర్ పుట్టిన రోజు నేడు. దక్షిణాది సినీ ఇండస్ట్రీకి చెందిన సినిమాల్లో నటించిన నాజర్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాగా పాపులర్. తమిళం, తెలుగు, కన్నడం, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో అదరగొట్టాడు. అలాగే టాప్ హీరోలైన ఓం పురి, మమ్ముట్టి, మోహన్ లాల్, నానా పటేకర్, కమల్ హాసన్‌లతో నాజర్ కలిసి నటించారు. 
 
నాజర్ మార్చి, 1958వ సంవత్సరం చెన్నైకి సమీపంలోని నత్తంలో జన్మించారు. పి.యు.సి స్టడీస్ చేసిన ఆయన ఆపై మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో బాటనీ డిగ్రీ చేశారు. రంగస్థల నటుడిగా బాగా పాపులరైన నాజర్.. సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. తాజ్ కోరమాండల్ హోటల్‌లో కేటరింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. కొన్ని కథలు, కవితలను మ్యాగజైన్లు, న్యూస్ పేపర్ల కోసం రాసే వారు. 
 
1982-83లో నాజర్ చెన్నై ఫిలిమ్ ఇన్సిస్టట్యూట్‌లో చేరి డిప్లొమా సాధించారు. అలా ప్రముఖ దర్శకుడు బాలచందర్ కళ్యాణ అగధిగల్ చిత్రంతో పరిచయం అయ్యారు. అతని పూర్తి పేరు నాజర్ ముహ్మద్. 1985లో నాజర్ సినీ అరంగేట్రం చేశారు. ఇప్పటి వరకు ఆయన దక్షిణాది, ఉత్తరాది కలిసి 300 సినిమాల్లో నటించారు. వెండితెర, బుల్లితెరలపై తన హవాను కొనసాగించి.. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. ఇలా తమిళంలో ప్రముఖ దర్శకులతో పనిచేశారు. సినిమాలు నిర్మించారు. 
 
ఇకపోతే.. నాజర్ తండ్రి మెహబూబ్ పాషా జ్యువెల్లరీ షాపు నడిపేవారు. నాజర్‌కు ఒక సోదరి, ముగ్గురు సోదరులున్నారు. నాజర్ కమీలాను ప్రేమించి వివాహం చేసుకున్నారు. సినీ ఛాన్సులు కోసం వెతుకుతూనే కమీలాతో ప్రేమలో పడ్డారు నాజర్. నాజర్ కమీలా దంపతులకు ముగ్గురు కుమారులున్నారు. నాజర్ పెద్దకొడుకు లిమ్ కాంక్ వింగ్ యూనివర్శిటీ (సైబర్జయా-మలేషియా)లో చదివారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు