ఛాతిలో నొప్పి.. ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు సాయాజీ షిండే!!

వరుణ్

శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (15:54 IST)
ప్రముఖ నటుడు సాయాజీ షిండే ఆస్పత్రిలో చేరారు. ఆయన అనారోగ్యం బారినపడటంతో ఆస్పత్రిలో చేర్చారు. గురువారం ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన మహారాష్ట్రలోని సతారాలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్రాు. పలు పరీక్షల అనంతరం హృదయ నాళాల్లో కొన్ని బ్లాక్స్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని వైద్యులు తెలిపారు. 
 
సాయాజీ షిండే ఆరోగ్యంపై వైద్యులు ఓ బులిటెన్ విడుదల చేశారు. "గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందులుపడుతున్నారు. రొటీన్ వైద్య పరీక్షల్లో భాగంగా మమ్మలను సంప్రదించారు. ఈసీజీలో స్వల్ప మార్పులు గుర్తించారు. దీంతో యాంజియోగ్రఫీ చేయించమని సూచించాం. గుండెలో కుడివైపు 99 శాతం బ్లాక్స్ గుర్తించాం. తీవ్రత దృష్ట్యా  వెంటనే యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరలోనే డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తాం" అని తాజాగా వైద్యులు వెల్లడించారు. 
 
మహారాష్ట్రకు చెందిన సాయాజీ షిండే నటుడిగా తెలుగువారికి సుపరిచితులు. జేడీ చక్రవర్తి నటించిన సూరితో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు. ఠాగూర్‌తో తెలుగు ప్రేక్షకులు చేరువయ్యారు. టాలీవుడ్‌లో తెరకెక్కిన చాలా చిత్రాల్లో ప్రతి నాయకుడు, సహాయనటుడు పాత్రలు పోషించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు