ఇదే తరహాలో తాజాగా తమిళనాడు రాజకీయ నాయకుడు, AIDMK మాజీ నాయకుడు AV రాజు, త్రిషకు క్షమాపణలు చెప్పాడు. తన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశాడు. ఇటీవల ఓ వీడియో ఇంటర్వ్యూలో, త్రిష రిసార్ట్‌లో ఇచ్చిన వినోదానికి సెటిల్‌మెంట్‌గా ఎమ్మెల్యే నుండి 25 లక్షలు అందుకున్నట్లు పేర్కొన్నాడు. AV రాజుపై చట్టపరమైన చర్య తీసుకుంటానని ఇప్పటికే త్రిష తెలిపింది. త్రిష ఏదైనా చట్టవిరుద్ధ కార్యకలాపాల కోసం డబ్బు తీసుకున్నట్లు తాను చెప్పలేదని ఏవీ రాజు చెప్పాడు. ఇంకా బేషరతుగా క్షమాపణలు చెప్పాడు.