నక్కిన చాలా మంచి వ్యక్తి.. ఇక వదిలేయండి ప్లీజ్... నటి అన్షు వీడియో

ఠాగూర్

బుధవారం, 15 జనవరి 2025 (12:40 IST)
తనను ఉద్దేశించి అసభ్యంగా కామెంట్స్ చేసిన టాలీవుడ్ దర్శకుడు నక్కిన త్రినాథరావుకు మద్దతుగా నటి అన్షు ఓ వీడియో రిలీజ్ చేసింది. నక్కిన చాలా మంచి వ్యక్తి అని, చాలా స్నేహంగా ఉంటారని పేర్కొన్నారు. పైగా, ఆయన చేసిన కామెంట్స్‌ను పెద్ద మనసుతో క్షమించి వదిలివేయండి ప్లీజ్ అంటూ ప్రాధేయపడ్డారు. 
 
ఇటీవల 'మజాకా' సినిమా టీజర్ రిలీజ్ వేడుకలో పాల్గొన్న దర్శకుడు త్రినాథరావు నటి అన్షుపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. నటి శరీరాకృతి గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో వెంటనే స్పందించిన త్రినాథరావు సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణ చెప్పారు. 
 
పొరపాటు జరిగిందని, తనను క్షమించాలని అన్షును కూడా కోరారు. అయితే, సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మారడంతో వివాదం పూర్తిగా సమసిపోలేదు. ఈ నేపథ్యంలోనే నటి అన్షు కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టారు.
 
డైరెక్టర్ త్రినాథ రావు చాలా మంచి వ్యక్తి అని, అందరితోనూ చాలా స్నేహంగా ఉంటారని అను చెప్పుకొచ్చారు. 'మజాకా' సినిమా షూటింగులో తాను పాల్గొన్న 60 రోజులూ తనను ఓ కుటుంబ సభ్యురాలిగా చూసుకున్నారని చెప్పారు. ఆయనపై తనకు గౌరవం ఉందన్నారు. టాలీవుడ్‌లో తన సెకండ్ ఇన్నింగ్స్‌కు ఇంతకంటే మంచి దర్శకుడు ఉండరేమోనని అను వ్యాఖ్యానించారు. ఆయన చేసిన కామెంట్స్ విషయంపై చర్చను ఇక ఆపేయాలని కోరుతూ 'మజాకా' విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అను చెప్పారు. 

 

Setting the record straight! @AnshuActress thanks @TrinadharaoNak1 Garu for his love, respect & guidance during #Mazaka. "He's an absolute pleasure to work with and a loveliest man on the planet."

Clearing all rumors, Actress Anshu praises director's kindness & professionalism!… pic.twitter.com/jVcOc2GFsS

— Indian Clicks (@IndianClicks) January 13, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు