ఈ సినిమా పూజ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ మారుతి, ప్రొడ్యూసర్ ఎస్. కె. ఎన్ , నక్కిన త్రినాధ రావు , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివేక కూచిబొట్ల తదితరులు హాజరయ్యారు. ఈ సినిమాకు డైరెక్టర్ మారుతి క్లాస్ చేయగా ప్రవీణ్ సత్తార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నక్కిని త్రినాధరావు ఫస్ట్ షార్ట్ డైరెక్ట్ చేయగా ధీరజ్ మొగిలినేని, వంశీ స్క్రిప్ట్ అందజేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు రమేష్ కడుముల మాట్లాడుతూ, ఈ సినిమా షూటింగ్ ఈనెల 15 నుండి ప్రారంభమవుతుంది. కంటిన్యూ షూటింగ్ వుంటుంది. అక్టోబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇది క్రైమ్ కామెడీ. స్వామిరారా, అంధధూన్ తరహాలో వుంటుంది. కథ చాలా అద్భుతంగా వుంటుంది. అందరికీ నచ్చుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు ఎస్ కే ఎన్ గారికి, మారుతి గారికి, నక్కిన త్రినాధరావు రావు గారికి, వంశీ గారికి, అలాగే ధీరజ్ మొగలినేని గారికి ఆయన ధన్యవాదాలు' తెలిపారు.
ప్రొడ్యూసర్ కేఐటిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ, కథ చాలా చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది. ఏప్రిల్ 15 నుంచి షూటింగ్ కి వెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులకు అలాగే ముఖ్య అతిథులకు పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
మాధవి అద్దంకి మాట్లాడుతూ, దర్శకులు రమేష్ చాలా ప్రతిభావంతుడు. ఈ సినిమా కథ, కథనం చాలా అద్భుతంగా వుంటుంది. ఈ సినిమా ప్లాట్ చాలా కొత్తగా వుంటుంది. ఈ సినిమాకు హీరోగా రాజ్ తరుణ్, హీరోయిన్ రాశి ఆప్ట్. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముఖ్య అతిథులకు ధన్యవాదాలు' తెలిపారు.