కీర్తి సురేష్ గ్రేట్.. మెగా ఆశీస్సులు అలా అందుకుంది.. ఫోటో చూస్తే?

శుక్రవారం, 16 ఆగస్టు 2019 (15:08 IST)
జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో మహానటి మూవీకి అవార్డుల పంట పడింది. జాతీయ ఉత్తమ నటి, బెస్ట్ కాస్ట్యూమ్స్, ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరీల్లో మహానటిని అవార్డులు వరించాయి.


ఏకంగా మూడు అవార్డులు సాధించిన ఈ మూవీ యూనిట్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంకా 'మహానటి' సినిమాలో కీర్తి సురేష్ కనబరిచిన అద్భుత నటనకుగాను జాతీయ ఉత్తమనటి అవార్డు వరించింది. 
 
తెలుగు సినిమా సగర్వంగా తలెత్తుకునేలా చేసినందుకు కీర్తిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సినీ ప్రముఖులంతా ఫోన్‌లు చేసి అభినందిస్తున్నారు.   ఈ నేపథ్యంలో కతార్ రాజధాని దోహలో జరిగిన సైమా అవార్డుల వేడుకలో ముఖ్య అతిధి మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. 
 
ఈ అవార్డుల కార్యక్రమంలో సావిత్రిని తలపించేలా సాంప్రదాయ చీరకట్టులో కీర్తి అలరించారు. కీర్తి మెగాస్టార్ వద్దకు చేరుకుని ఎంతో వినమ్రంగా నవ్వులు చిందిస్తూ ముచ్చటించారు. ఈ సందర్భంగా కీర్తీ సురేష్.. "మీరంటే.. నాకు చాలా ఇష్టమని తెలిపారు. మెగాస్టార్ చిరునవ్వులు చిందిస్తూ ఆమెకు ఆశీస్సులు అందించారు. ఈ దృశ్యాన్ని సైమా అవార్డ్స్ ఆర్గనైజర్స్ ట్వీట్టర్‌లో ట్వీట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు