అందంగా ఉన్నారు... వయసు తక్కువగా ఉంది.. రెండో పెళ్లి చేసుకుంటారా?

ఠాగూర్

గురువారం, 4 జనవరి 2024 (15:46 IST)
నటి మీనా మొదటి భర్త సాగర్ అనారోగ్యం కారణంగా మృతి చెందారు. దీంతో ఆమె రెండో పెళ్ళి చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుంది. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇపుడు మరోమారు ఓ విలేకరి అడిగిన తిక్క ప్రశ్నకు సూటిగా సుత్తిలేకుండా బదులిచ్చారు. అందంగా ఉన్నారు.. వయుసు కూడా తక్కువగానే ఉంది. రెండో పెళ్లి చేసుకుంటారా? అని విలేకరి పదేపదే ప్రశ్నించడంతో దానికి మీనా సమాధానమిచ్చారు. 
 
"మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు ఇపుడైతే లేదు. ఎవర్నీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతావా? అంటే అలా చాలా మంది ఉంటున్నారు కదా. అలాగే నేను వాళ్లలాగే ఉంటానని కాదు. ఎవరి పరిస్థితి వాళ్లది. నా జీవితం గురించి నేనెపుడూ ఆలోచన చేయలేదు. అలాగే, ముందుగా ఏదీ ప్లాన్ చేసుకోలేదు. తక్కువ వయసు, ఎక్కువ వయసు అని కాదు. నా భవిష్యత్ గురించి నేను ఊహించలేను. నేను కాదు. ఎవరూ ఊహించలేరు. ముందు నా జీవితం గురించి కాకుండా కూతురి గురించి ఆలోచిస్తున్నాను. సినిమాల్లోకి వస్తానని, ఇంత పెద్ద హీరోయిన్ అవుతానని నేను ఎన్నడూ అనుకోలేదు. 
 
తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సరసన నటిస్తానని ఊహించలేదు. జీవితం ఇలాగే ఉంటుందని అనుకోలేను పెళ్లి కూడా అంతే. అపుడు, ఇపుడు అని చెప్పలేదు. అలాగని ఒంటరిగా ఉండిపోతానని చెప్పలేను. రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇపుడు నేను ఆలోచిస్తున్నది నా కూతురు గురించి మాత్రమే. నా కంటే నా కుమార్తె నాకు ముఖ్యం. నా సుఖం, నా సంతోషం మాత్రమే కాదు. నాఫస్ట్ ప్రియారిటీ నా కుమార్తె. ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి వెయిట్ చేయడమే. పెళ్లి గురించి ఏమి ఊహించి చెప్పలేను" అని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు