మలయాళీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి తాజాగా ఓ మాల్‌లో అందరూ చూస్తుండగా వేధింపులను ఎదుర్కొన్నారు. తాను మాల్‌లో షాపింగ్ చేస్తుడగా.. ఇద్దరు యువకులు అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆరోపణలు చేస్తూ తాజాగా సదరు నటి ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ సందేశం పెట్టారు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న కొంతమంది పురుషులు ఇలాంటి అకృత్యాలకు పాల్పడి మహిళల స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారన్నారు.
వివరాల్లోకి వెళితే.. నగరంలో పేరుపొందిన.. రద్దీగా వుండే షాపింగ్ మాల్‌కు కుటుంబంతో వెళ్లిన నటి వద్ద ఇద్దరు అబ్బాయిలు అభ్యంతరకరంగా ప్రవర్తించారు. అభ్యంతరకరంగా వెనుక నుంచి తాకారు. ఆ క్షణం ఏమీ అర్థం కాలేదని.. పొరపాటున వాళ్ల చేతులు తనకు తగిలాయని అనుకున్నానని వెల్లడించింది సదరు నటి. కానీ, ఏదో తెలియని భయం, కోపం మాత్రం వచ్చిందని చెప్పుకొచ్చింది.
దీన్ని చూసిన తన సోదరి.. ఆ అబ్బాయిలు కావాలనే ఇబ్బంది పెడుతున్నారని తనతో చెప్పిందని.. దీంతో వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం తన సోదరితో కలిసి అదే మాల్‌లో ఓ షాప్‌లో కొన్ని వస్తువులు కొనేందుకు వెళ్లానని అక్కడే మా అమ్మ, సోదరుడు ఉన్నారు. వస్తువులు కొన్నా అనంతరం బిల్ కట్టేందుకు లైన్‌లో వుండగా తిరిగి ఆ ఇద్దరు యువకులు అక్కడికి వచ్చారు. తనతో మాట్లాడడానికి ప్రయత్నించారు. ఇదంతా గమనించిన మా అమ్మ వారిని పట్టుకునేందుకు ప్రయత్నించింది.