శ్రియ అధర అందాలు జుర్రుకుంటున్న రష్యన్ భర్త

సోమవారం, 21 సెప్టెంబరు 2020 (15:09 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో ఒకపుడు అగ్ర హీరోయిన్‌గా వెలుగొంది, అగ్ర హీరోలందరి సరసన నటించిన నటి శ్రియ. "ఇష్టం" అనే చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత దశాబ్దకాలం పాటు తెలుగు ప్రేక్షకులకు తన అందాలు చూపించి ఆలరించింది. గత కొంతకాలంగా ఆమెకు సరైన మూవీ అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకికాస్త దూరమైంది. అయితే, అడపాదడపా వచ్చే మూవీలను చేస్తూవస్తోంది. 
 
ప్రస్తుతం 'గమనం' అనే చిత్రంలో ప్రధాన పాత్రను పోషించనుంది. అదేసమయంలో ఆమె ఓ రష్యా యువకుడి ప్రేమలోపడిపోయి పెళ్లి కూడా చేసుకుంది. ప్రస్తుతం తన ప్రియుడుతో డేటింగ్‌లో మునిగితేలుతోంది. అయితే, ఈ క్రేజీ క‌పుల్ ఇద్ద‌రూ సోష‌ల్ మీడియాలో పలు ఫొటోలు పోస్ట్ చేస్తూ.. త‌మ ఫాలోవ‌ర్లలో జోష్ నింపుతుంటారు.
 
తాజాగా శ్రియ - ఆండ్రీవ్ లిప్‌లాక్ ఫొటో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. చివ‌ర‌గా 2017లో వ‌చ్చిన‌ 'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి' చిత్రంలో మెరిసిన శ్రియ‌.. ప్ర‌స్తుతం మ‌ల్లీలింగ్యువ‌ల్‌గా వ‌స్తోన్న "గ‌మ‌నం" చిత్రంతో న‌టిస్తోంది. అంద‌మైన పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన ఆండ్రీవ్ కొచ్చీవ్‌కు ధ‌న్యవాదాలు.. విషెస్ చెప్పిన అంద‌రికీ కృత‌జ్ఞ‌తలు అంటూ శ్రియ ట్వీట్ చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు