Subhash Nuthalapati, Karthik Raju, Simran Chaudhary, Mahesh Reddy
కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా అధర్వ. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో విజయ, ఝాన్సీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఎంతో గ్రాండ్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయిండి.